Badminton | భారత స్టార్ షట్లర్ విజయంపై చంద్రబాబు ప్రశంసలు
అమరావతి, ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో అద్భుత విజయంతో టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.
జపాన్‌కు చెందిన యమగుచిపై వరుస గేమ్‌ల్లో 21-17, 21-17 తేడాతో విజయం సాధించి టైటిల్ గెలవడం భారత బ్యాడ్మింటన్ చరిత్రలో మరో గర్వకారణమని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విజయం భారత క్రీడా రంగానికి గొప్ప మైలురాయిగా నిలిచిందన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా శుభాభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు.. “పీవీ సింధుకు హృదయపూర్వక అభినందనలు. జపాన్ ఓపెన్ విజేతగా నిలవడం భారత బ్యాడ్మింటన్‌కు చారిత్రాత్మక ఘట్టం. రాబోయే ఒలింపిక్స్‌లో కూడా అత్యుత్తమ ప్రదర్శన చేసి దేశానికి మరిన్ని విజయాలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు.
