గురుకుల బాలికల సంచలన విజయం..
కాజీపేట, ఆంధ్ర ప్రభ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల, మడికొండలో చదువుతున్న బాలికలు జాతీయ స్థాయి నీట్ యుజి పరీక్షలో తమ ప్రతిభను చాటుకొన్నారని ప్రిన్సిపాల్ జి. జ్యోతి అన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జ్యోతి మాట్లాడుతూ నీట్ యూజీ లో ఎన్. శ్రీలేఖ కే. సాయిన జి.భవాని ఎన్ స్నేహిత చైత్ర మేరీ పరీక్షల్లో ప్రతిభను కనబరిచారని తెలిపారు. ఆర్ స్పందన కి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ నిట్ వరంగల్ లోను,దివ్య ఐఐటీ బిలాయ్ లో సీట్ సాధించడం జరిగిందని తెలిపారు.తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకతతో సాధించిన ఈ విజయం భవిష్యత్ విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు. ఈసందర్బంగా విద్యార్థినులను ప్రిన్సిపాల్ జ్యోతి అధ్యపాక బృందం అభినందించారు.
