గూడూరు సమన్వయకర్తగా నియామకం

  • కాకాణిని కలిసిన బూదూరు గురవయ్య

నెల్లూరు, ఆంధ్రప్రభ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఇటీవల నియమితులైన గూడూరు మండల పరిషత్ అధ్యక్షుడు బూదూరు గురవయ్య, మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా గురవయ్యకు కాకాణి గోవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గూడూరు నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలతో సమన్వయం పెంచుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలపై చురుకుగా స్పందించాలని, పార్టీ శ్రేణులతో నిరంతరం అనుసంధానంగా ఉండాలని చెప్పారు.

గూడూరు నియోజకవర్గానికి ప్రత్యేక రాజకీయ చరిత్ర ఉందని, గతంలో ప్రజలకు సేవలందించిన నాయకుల స్ఫూర్తితో ముందుకు సాగాలని గురవయ్యకు సూచించినట్లు తెలిపారు. పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేసి ప్రజల్లో విశ్వాసం పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు.

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురవయ్యకు మరోసారి అభినందనలు తెలియజేస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు పూర్తి సహకారం అందించాలని కాకాణి కోరారు.