సామాజిక సేవ మనందరి బాధ్యత..

సామాజిక సేవ మనందరి బాధ్యత..
పాయకాపురం, ఆంధ్రప్రభ : కల్వరి ప్రేమ ప్రార్ధన సహవాసము సంఘము క్రీస్తు ఆధ్యాత్మిక బోధనలు మాత్రమే కాకుండా, సామాజిక సేవలు కూడా నిర్వహించడం జరుగుతుందని పాస్టర్ రవికుమార్ కృపామణి అన్నారు. ఈ వైద్య శిబిరం స్థానిక 64 వ డివిజన్ కండ్రికలోని టీడీపీ కార్యాలయం (అధ్యక్షుడు కె.రవికుమార్) ప్రక్కన కల్వరి ప్రేమ ప్రార్ధన సహవాసము ఆవరణలో నిర్వహించారు. సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో అనేక మంది పాల్గొని, వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు.
ఈ శిబిరంలో షైన్ హాస్పటల్స్ వైద్యులు కాట్రగడ్డ వికాస్ ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, గైనకాలజీ, ఇ.యన్.టి. సర్జరీలు, జనరల్ మెడిసిన్లకు సంబంధించిన రోగాలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, రోగులకు ఉచితంగా మందులు అందజేశారు. నమ్మకమైన చికిత్స కేవలం రూ.79,999 మోకాల మార్పిడి శాస్త్ర చికిత్స ప్రారంభ అనుభవజ్ఞులైన వైద్య బృందం అంతర్జాతీయ ప్రమాణాలతో చికిత్స అత్యాధునిక టెక్నాలజీ, సదుపాయాలతో 24 గంటల ఆర్థోపెడిక్ సేవలతో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి గర్భసంచి తొలగింపు, వెరికోస్ వెయిన్స్ సర్జరీలు ఉచితంగా చేయబడునని డాక్టర్ వికాస్ పేర్కొన్నారు.
