పని చేస్తుండగా ఊహించని ప్రమాదం..
- కార్మికుడికి తీవ్రగాయాలు
మచిలీపట్నం, ఆంధ్రప్రభ: కృష్ణా జిల్లా పెద్దతుమ్మిడికి చెందిన శ్రీనివాస్ అనే కూలీ కార్మికుడు గురువారం బంటుమిల్లిలో పనులకు వెళ్లాడు. పనులు నిర్వహిస్తున్న సమయంలో ఫిల్లర్లు వేస్తున్న బాక్స్ ఒక్కసారిగా అతనిపై కూలిపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన సహచర కార్మికులు వెంటనే స్పందించి శ్రీనివాస్‌ను చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
