ఎస్‌ఐఆర్ సర్వే వేగవంతం చేయాలి: ప్రత్యేక అధికారి రాథోడ్ రమేష్

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఎస్ఐఆర్ సర్వేను వేగవంతం చేయాలని ఉట్నూరు ఎస్ ఐ ఆర్ సర్వే మండల ప్రత్యేక అధికారి రాథోడ్ రమేష్ కోరారు. ఆయన శనివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని షాపూర్ లో నిర్వహించిన ఎస్ ఐ ఆర్ సర్వేవిధానాన్ని ఆన్లైన్ విధానాన్ని పరిశీలించారు. సర్వేపై బి ఎల్ ఓ బి ఎల్ ఈ లకు అవగాహన కల్పించారు.

ఈ సర్వేకు ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజలు సహకరించాలని 100% సర్వే పూర్తిగా జరిగేలా సర్వేను వేగవంతం చేయాలని ఆయన కోరారు. ఏమైంది ఆ సమస్యలు ఉంటే రెవెన్యూ అధికారులకు లేక బిఎల్ఓ లకు తెలపాలని ఆయన కోరారు. ఎస్ ఐ ఆర్ సర్వే ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ తహసిల్దార్ కోట్నాక్ రఘునాథ్ రావు, షాంపూర్ సర్పంచ్ గారుల దీపక్, బిఆర్ఎస్ జిల్లా నాయకులు కాట0రమేష్, బి ఎల్ ఓ ,బి ఎల్ ఏ లు, ప్రజలు పాల్గొన్నారు.