Shabad Murder Case | షాబాద్ నిందితుడి కోసం పోలీసుల ప్రకటన

Shabad Murder Case | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసులు ముమ్మర గాలింపు కొనసాగిస్తున్నారు. నిందితుడిని త్వరగా పట్టుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్న పోలీసులు అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి ప్రకటించారు.

రాజ్‌కుమార్ ఆచూకీపై సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు పలు ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ప్రజలు ఏదైనా విశ్వసనీయ సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.