Utnur | నాగపూర్‌లో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ
Utnur | నాగపూర్‌లో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ
ఆంధ్రప్రభ: అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని నాగపూర్ గ్రామంలో శనివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్, నారాయణ మహారాజ్, రామ్‌సింగ్ మహారాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూజలు నిర్వహించి, అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రితీష్ రాథోడ్ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశం, ధర్మం, ప్రజల రక్షణ కోసం చేసిన పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలను నేటి తరానికి చేరవేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం శివాజీ మహారాజ్ చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నాగపూర్ సర్పంచ్ కల్పన సునీల్ జాదవ్, ఉట్నూర్ మాజీ వైస్ ఎంపీపీ బాలాజీ, మాజీ జడ్పీటీసీ జగ్జీవన్, మాజీ ఎంపీటీసీ కందుకూరి రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, ఛత్రపతి శివాజీ మహారాజ్ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
