టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ పేరెంట్స్ కమిటీ ఎన్నిక..
- చైర్మన్ గా అల్లకొండ కుమార్
చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పేరెంట్స్ కమిటీని శనివారం ప్రిన్సిపాల్ గోల్కొండ బిక్షపతి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నాట్లు తెలిపారు. 2026- 27 నూతన విద్యా సంవత్సరంలో పేరెంట్స్ కమిటీ ఛైర్మెన్ గా అల్లకొండ కుమార్ ఎన్నుకున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఉపాధ్యక్షుడిగా ఎస్. దేవేందర్, ప్రధాన కార్యదర్శిగా – పుల్ల ప్రతాప్, కార్యదర్శిగా – కన్నూరి రమేష్, సహాయ కార్యదర్శి- ఎస్ అశోక్, కోశాధికారి- పి. సతీష్, సభ్యులుగా రాజు, మోతె రమేష్ , ఆర్షియా, తిరుపతి, శంకర్ , లను ఎన్నుకున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.

ఈ సందర్భంగా నూతన పేరెంట్స్ కమిటీ చైర్మన్ అల్లకొండ కుమార్ మాట్లాడుతూ ఎన్నికకు సహకరించిన స్కూల్ ప్రిన్సిపాల్ ,పేరెంట్స్ కి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ విద్యాసంవత్సరంలోప్రజాప్రభుత్వం విద్యార్థులకు అమలు చేస్తున్న మెరుగైన విద్య పెంచిన మెస్ చార్జీలు, వారికి ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సౌకర్యాన్ని కూడా అందించడంలో నా వంతు కృషి చేస్తాన అన్నారు. గురుకులంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సహకారంతో గురుకుల అభివృద్ధికి కృషి చేస్తానని కుమార్ తెలిపారు.
