చిరుత దాడిలో ఆవు మృతి

  • నష్టపరిహారం అందించాలని రైతు విజ్ఞప్తి

కుబీర్, ఆంధ్రప్రభ : కుబీర్ మండలంలోని తాండా శివారులోని అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. మేత కోసం వెళ్లిన పశువుల మందపై చిరుత దాడి చేయడంతో ఓ ఆవు మృతి చెందింది.

స్థానికుల వివరాల ప్రకారం, దొడ్డన గ్రామానికి చెందిన రైతు జాదవ్ ఉత్తంకు చెందిన ఆవును చిరుత చంపింది. ఘటన సమయంలో పశువుల కాపరి పశువులను అటవీ ప్రాంతంలో మేపుతుండగా ఈ దాడి జరిగినట్లు తెలిపారు.

ఆవు మృతి చెందడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం మంజూరు చేయాలని కోరారు. అటవీ శాఖ అధికారులు, పశువైద్య అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి, తగిన చర్యలు తీసుకోవాలని రైతు విజ్ఞప్తి చేశారు.