ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన దయాకర్

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : జనగాం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా సీనియర్ నాయకుడు, మాజీ ఎంపిటిసి, ఎంపిటిసిల ఫోరమ్ స్టేషన్ ఘన్‌పూర్ మండల అధ్యక్షుడు సింగపురం దయాకర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహ రిని ఆయన నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలి టీ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ (సన్నీ), కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాటి కిషన్ రాజు, మాజీ జెడ్పిటిసి స్వామి నాయక్, సింగపురం ఎల్లయ్య (గడ్డం), సింగపురం వెంకటయ్య, జీడి రమేష్ కుమార్, గాండ్ల రాజు, సింగపురం బాబు, చింత జోసెఫ్, మాతంగి దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply