ప్రజా ప్రయోజనార్థం SRR ఫౌండేషన్ మరో ముందడుగు

రాయపర్తి, ఆంధ్రప్రభ : రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సూచనల మేరకు రాయపర్తి మండలం జయరాం తండా (S) గ్రామంలో SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన వాటర్ ప్లాంట్ రూమ్‌ను శనివారం ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రారంభించారు. ఇటీవల గ్రామ పర్యటనలో తండా ప్రజలు తాగునీటి సమస్యను విన్నవించగా, ప్రజా ప్రయోజనార్థం తండా ప్రజలకు ఉచిత మినరల్ వాటర్ అందించాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టారు.
‘IIT ఖరగ్‌పూర్ హైదరాబాద్ చాప్టర్’ మరియు ‘కృషి విజ్ఞాన కేంద్ర మామునూరు’ వారి సహకారంతో వాటర్ ప్లాంట్ మిషన్ మంజూరైంది. ప్లాంట్ ఏర్పాటుకు రూమ్ అవసరం కాగా, SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూమ్ నిర్మాణం పూర్తి చేసి IIT ఖరగ్‌పూర్, కేవీకే ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. త్వరలోనే ప్లాంట్ ద్వారా తండా ప్రజలకు ఉచితంగా స్వచ్ఛమైన మినరల్ వాటర్ అందనుంది.మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్ఫూర్తితో SRR ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాయపర్తి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మునవత్ నర్సింహా నాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్, మండల పార్టీ నాయకులు ఏలె సుందర్, లేతకుల రంగా రెడ్డి, మండల పార్టీ అధికార ప్రతినిధి తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, మండల పార్టీ నాయకులు సుధం మహేందర్, చిన్నపాక రాంబాబు, పెరటి యాదవ రెడ్డి, చందు రామ్, పోతుల కొమురుమాళ్ళు, సంకినేని ఎల్లస్వామి, కోలా సంపత్, చందు లక్ష్మన్, ఐత జంపి, స్థల దాత గుగులోత్ సింగ్యా, స్థానిక సర్పంచ్ గుగులోత్ రమేష్, ఉప సర్పంచ్ తేజవత్ గోవింద్, పార్టీ ముఖ్య నాయకులు గౌస్ నాయక్, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
