Samsthan Narayanapur తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

Samsthan Narayanapur తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

  • లింగవారి గూడెంలో భావోద్వేగ ఘట్టం.. కన్నీటి వీడ్కోలు

సంస్థాన్ నారాయణపురం (Samsthan Narayanapur), ఆంధ్రప్రభ:

సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారి గూడెం గ్రామంలో భావోద్వేగ సంఘటన చోటుచేసుకుంది. చిట్యాల సత్తిరెడ్డి (77) గుండెపోటుతో మరణించగా, ఆయన అంత్యక్రియలను కుమార్తె సరళ స్వయంగా నిర్వహించారు.

కుమారులు లేని పరిస్థితిలో ఏకైక కుమార్తె పల్లె సరళ తన తండ్రికి తలకొరివి పెట్టి, శాస్త్రోక్తంగా అంత్యక్రియలు పూర్తి చేయడం గ్రామంలో అందరినీ కలచివేసింది. తండ్రి పార్థివ దేహం వద్ద ఆమె కన్నీటిపర్యంతమవుతూ చేసిన తుదివీడ్కోలు దృశ్యం హృదయాలను తాకింది.

సత్తిరెడ్డి మృతికి పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు నివాళులర్పించారు. ఆయన పార్థివ దేహంపై ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఉజ్జిని యాదగిరి రావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తండ్రి-కూతురు బంధానికి ప్రతీకగా నిలిచిన ఈ ఘటన గ్రామంలో అందరి మనసులను కలిచివేసింది.