రెండు నియోజకవర్గాల్లో జోష్…
- హైలెట్ గా ఇంటింటికీ టీడీపీకి ఎంపీ చిన్ని
- సెంట్రల్ నుంచి వెస్ట్ వరకు… ఇంటింటికీ టీడీపీతో ఎంపీ చిన్ని సందడి!
- సెంట్రల్–పశ్చిమలో ఇంటింటికీ టీడీపీ…
- ప్రజల గడప వద్దకు ఎంపీ చిన్ని!
- ఇంటింటికీ టీడీపీ.. ప్రజల్లోకి ఎంపీ చిన్ని
- బోండాఉమా,బుద్ధా వెంకన్నలతో నియోజకవర్గ ప్రజలలోకి
విజయవాడ ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాధ్ (చిన్ని) శనివారం చురుకుగా పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజల గడపగడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ప్రతి హామీని నెరవేర్చాం..
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ, పార్టీ పశ్చిమ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్నతో కలిసి ఎంపీ చిన్ని ఇంటింటికీ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు, స్థానిక అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజల సూచనలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
