Khammam బాలికపై దారుణానికి బాధ్యులకు కఠిన శిక్ష విధించాలి

Khammam బాలికపై దారుణానికి బాధ్యులకు కఠిన శిక్ష విధించాలి

  • నేరానికి పార్టీ రంగు ఉండదు: మాజీ కార్పొరేటర్ బిక్కసాని ప్రశాంత లక్ష్మి

ఖమ్మం (Khammam), ఆంధ్రప్రభ:

ఖమ్మం నగరంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అమానుష ఘటనను మాజీ కార్పొరేటర్ బిక్కసాని ప్రశాంత లక్ష్మి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో నిందితుడు ఏ రాజకీయ పార్టీకి చెందినవాడైనా, ఎంతటి ప్రభావశీలుడైనా చట్టం ముందు తలవంచాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. నేరానికి పార్టీ రంగు ఉండదని, నేరస్థుడు కేవలం నేరస్థుడేనని పేర్కొన్నారు.

బాధిత బాలికకు మెరుగైన వైద్యం, పూర్తి భద్రతతో పాటు న్యాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె అన్నారు. ఘటనలో బాధ్యులైన వారికి అత్యంత కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.

అలాగే నిందితుడిని రక్షించేందుకు లేదా దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే, వారు ఏ పార్టీకి చెందినవారైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నేరం చేసినవాడితో పాటు నేరాన్ని కాపాడే ప్రయత్నం చేసినవాడు కూడా చట్టం ముందు జవాబు చెప్పాల్సిందేనని ఆమె వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబానికి ఆమె పూర్తి సంఘీభావం ప్రకటించారు.