TG | వైభవంగా భోగి వేడుకలు

TG | వైభవంగా భోగి వేడుకలు
TG | నల్గొండ, ఆంధ్రప్రభ : మకర సంక్రాంతి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు జిల్లా కేంద్రంలోని వీటీ కాలనీలోని బీజేపీ రాష్ట్ర నాయకులు, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ నివాసంలో భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ భోగ భాగ్యాలను అందించే పండుగ భోగి అని, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడానికి మకర సంక్రమణాన్ని సంక్రాంతి అని పిలుస్తారని, ఇలాంటి పండుగను కుల మతాలకతీతంగా, పార్టీలకతీతంగా జరుపుకోవడం ఎంతో సంతోషదాయకమన్నారు.

సాంస్కృతి సాంప్రదాయ పద్ధతిని కొనసాగించే విధంగా సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు, రైతులు సుఖ సంతోషాలతో ఉండి.. చీకటి నుంచి వెలుగు వచ్చే మకర సంక్రాంతిలో చెడు పారద్రోలి వెలుగు వచ్చే విధంగా దేశంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ముగ్గులు వేసి గొబ్బెమ్మలను అలంకరించి శ్రీకృష్ణునిపూజ చేసి భోగి మంటలు ప్రారంభించి నృత్యాలు చేశారు. హరిదాసు కు బియ్యం పోసి కానుకలను అందజేశారు. కార్యక్రమంలో బండారు రమణ,రావిరాల వెంకటేశ్వర్లు, బొజ్జ నాగరాజు, సాయి, గుర్రం వెంకన్న పోతేపాక సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.
