Rural Employment | వీబీ-జీ రామ్ జీ పథకంను రద్దు చేయాలి…
Rural Employment | వీబీ-జీ రామ్ జీ పథకంను రద్దు చేయాలి…
Rural Employment | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం (ఎంజీఎన్ఆర్ జీఏ)ను రద్దు చేసి వికసిత్ భారత్ రోజ్ గార్, ఆజీవికా హామీ మిషన్ గ్రామీణ్(Livelihood Assurance Mission Grameen) ( వీబీ-జీ రామ్ జీ ) బిల్లు -2025ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తూ బెల్లంపల్లిలోె సీపీఐ లీడర్లు నిరసన చేపట్టారు. సోమవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వీబీ-జీ రామ్ జీ పథకంపై కేంద్ర ప్రభుత్వం(Central Government) తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గాంధీ కూడలిలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్, పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి మాట్లాడుతూ.. దేశంలో పేద ప్రజలకు పని లేక, తిండి లేక అనేక మంది ఆకలి చావులకు గురవుతున్న పరిస్థితుల్లో వాటికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో 2005లో అప్పటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్(Manmohan Singh) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు.
కమ్యూనిస్టు పార్టీల ఒత్తిడితోనే ఈ చారిత్రాత్మక పథకం అమలులోకి వచ్చిందని గుర్తుచేశారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం నిధులు సమకూర్చడం ద్వారా లక్షలాది పేద కుటుంబాలకు ఉపాధి లభించిందని, ఎంతోమంది ఆకలి చావుల నుంచి రక్షించబడ్డారని వారు పేర్కొన్నారు.
కేంద్రంలో పాలనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని బలహీనపరిచి, కొత్త పేరుతో ప్రవేశపెట్టడం ద్వారా పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి(privatized), సంపన్నులను మరింత సంపన్నులుగా మార్చే విధానాలు అమలు చేస్తున్నదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా కంటక ప్రభుత్వంగా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకాన్ని తక్షణమే రద్దు చేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ(Rural Employment Guarantee) పథకాన్ని అదే పేరుతో కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలంతా సంఘటితంగా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ నిరసన, ధర్నా కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శులు బొంతల లక్ష్మీనారాయణ, కొండ బానేష్, జిల్లా సమితి సభ్యులు తిలక్ అంబేద్కర్, డీఆర్ శ్రీధర్, రత్నం రాజం, బీకేవైఎం జాతీయ సమితి సభ్యుడు అక్కెపల్లి బాపు, జిల్లా బిల్డింగ్ వర్కర్స్(Building Workers) యూనియన్ కార్యదర్శి జాడి పోశం, లీడర్లు బొంకూరి రామచందర్, బియ్యాల ఉపేందర్, దాగం రాజలింగు, ప్రహలాద్, కృష్ణింగు హనుమంతు, పులి శంకర్, మహేందర్ రెడ్డి, సుధాకర్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
