చెన్నూరులో అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం
చెన్నూర్ ఆంధ్రప్రభ: చెన్నూరు పోలీసుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహాత్మా జ్యోతి బాపులే స్కూల్ నుంచి బస్టాండ్ వరకు విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఎస్సై రాజశేఖర్ విద్యార్థులచే మాదక ద్రవ్య నిర్మూలనకు మా వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, విద్యార్థులు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
