Rs.120cr | వేప్‌లను స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ
Rs.120cr | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : దేశంలో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్‌ల అక్రమ రవాణా చేస్తున్న భారీ స్మగ్లింగ్ ముఠాను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో నిషేధిత ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
డీఆర్‌ఐ అధికారులు చేపట్టిన దాడుల్లో 3 లక్షలకు పైగా ఈ-సిగరెట్లు, వేప్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.120 కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా బ్లాక్ మార్కెట్లలో ఈ ఉత్పత్తులను సరఫరా చేస్తున్న ముఠాపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం.
ప్రాథమిక విచారణలో అంతర్జాతీయ కస్టమ్స్ వ్యవస్థ కళ్లుగప్పి ఈ అక్రమ దందా కొనసాగుతున్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. విదేశాల నుంచి రహస్య మార్గాల్లో వేప్‌లు, ఈ-సిగరెట్లు దేశంలోకి తీసుకొచ్చి విక్రయిస్తున్న నెట్‌వర్క్‌పై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
