వెయిట్ లిఫ్టింగ్ లో ఏపీ అథ్లెట్ల హవా..

  • 87 ప్లస్ కేజీల విభాగంలో సత్యజ్యోతికి కాంస్యం

ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో ఏపీకి చెందిన మరో క్రీడాకిరిణి ప్రతిభచాటింది. 87 ప్లస్ కిలోల కేటగిరీలో ఏపీ వెయిట్ లిఫ్టర్ టి.సత్యజ్యోతి కాంస్యం సాధించింది. ఇప్ప‌టికే పురుషుల విభాగం 67 కిలోల కేటగిరీలో నీలం రాజు, మహిళల 71 కిలోల విభాగంలో పల్లవి స్వర్ణ పతకాలు సాధించారు.

కాగా, టి.సత్యజ్యోతి కాంస్య పతకం సాధించ‌టం ప‌ట్ల‌ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో స్పందిస్తూ అభినంద‌న‌లు తెలిపారు.

వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో 87 ప్లస్ కిలోల కేటగిరీలో కాంస్యం సాధించిన‌ సత్యజ్యోతికి అభినందనలు…. మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

విజయనగరంకు చెందిన సత్యజ్యోతి జాతీయ క్రీడల వెయిట్ లిఫ్టింగ్ క్రీడాంశంలో కాంస్యం సాధించినందుకు అభినందిస్తున్నాను అంటూ మంత్రి లోకేశ్ కూడా ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *