సంగారెడ్డి డీఈవోగా రోహిణి బాధ్యతల స్వీకారం
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : హైదరాబాద్ నుంచి బదిలీపై సంగారెడ్డి జిల్లాకు వచ్చిన రోహిణి గురువారం జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ)గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యావేత్తలు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యారంగంలో తనకున్న అనుభవంతో జిల్లా విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల విద్యా నైపుణ్యాల పెంపు, విద్యాశాఖ కార్యక్రమాల సమర్థవంతమైన అమలుకు ఆమె నాయకత్వం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రోహిణి శుభాకాంక్షలు తెలుపుతూ సంగారెడ్డి జిల్లా విద్యారంగ అభివృద్ధికి ఆమె విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించారు.
