ఉట్నూర్ లో రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ పట్టణంలోని పాత బస్టాండ్ నుండి ఐబి వెళ్లే రోడ్డును ఇరువైపులా రోడ్డు వెడల్పు పనులకు సోమవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శ్రీకారం చుట్టారు. ఉట్నూర్ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్ ఉప సర్పంచ్ అశ్రద్ బేగం అన్సారి నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాత బస్టాండ్ నుండి ఏసియన్ బేకరీ వరకు ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ నిధుల నుండి 20 లక్షలతో చేపట్టే రోడ్డు వెడల్పు పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉట్నూర్ పంచాయతీరాజ్ డిఇ పవర్ రమేష్ ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్, ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ ఈవో శంకర్ అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత బస్టాండ్ నుండి ఏసియన్ బేకరీ వరకు నిర్మించే రోడ్డు వెడల్ పనులు తోపాటు ఏసియన్ బేకరీ నుండి ఉట్నూర్ ఐబి చౌరస్తా వరకు రోడ్డు వెడల్పు పనులకు తన ఎమ్మెల్యే కోటా నుండి నిధులు మంజూరు చేయిస్తానని అదేవిధంగా పాత బస్టాండ్ నుండి ఐ బీ చౌరస్తా వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు స్తంభాలు వరుసగా ఉండేలా చూడాలని స్తంభాలకు మార్కింగ్ చేయాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కోరారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్,ఉప సర్పంచ్ అశ్రద్ బేగం అన్సారి, అదిలాబాద్ డిసిసి ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్, జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బానోత్ జైవంతరావు , డిసిసి ఉపాధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య ఆదిలాబాద్ ఆర్టిఏ మెంబర్ దూట రాజేశ్వర్, ఉట్నూర్ పంచాయతీరాజ్ డిఇ పవార్ రమేష్, ఉట్నూర్ పంచాయతీ ఈవో శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సయ్యద్ నిసార్, కొత్తపెల్లి మహేందర్, బిరుదుల లాజర్, రాజేష్ జాదవ్, అచ్చ దేవానంద్,స్వామి , వార్డు సభ్యులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
