మండలంలో బాల్య వివాహం కలకలం..!
చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : మండలంలోని ఓ తండాలో బాల్య వివాహం విషయం కలకలం రేపుతుంది.ఇటీవలే పదవ తరగతి పూర్తి చేసుకున్న అమ్మాయికి అదే తండాకి చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.మరో రెండు రోజుల్లో వివాహం జరగబోతున్నట్లు ఇందుకు సంబందించిన వివాహ ఆహ్వాన పత్రికలు,ఇరువురి ఇండ్ల దగ్గర పెళ్లికి సంబందించిన ఏర్పాట్లు సైతం పూర్తయినట్లు సమాచారం.ఇట్టి విషయం తెలుసుకున్న సదరు తండా అంగన్వాడీ సెంటర్ సెక్టర్ ఐసిడిఎస్ సూపర్ వైజర్,వివిధ శాఖల అధికారులు తండాలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది.
