స్పాట్ వాల్యుయేషన్ తనిఖీ…

స్పాట్ వాల్యుయేషన్ తనిఖీ…

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్…

కాజీపేట, ఆంధ్రప్రభ : కాజీపేట పట్టణం ఫాతిమా నగర్‌లోని ఫాతిమా గర్ల్స్ హైస్కూల్‌లో జరుగుతున్న 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్‌ను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సోమవారం అకస్మికంగా తనిఖీ చేశారు. పేపర్ల మూల్యాంకనం చేస్తున్న ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు.

ఉపాధ్యాయుల సమస్యలు, వసతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్పాట్ వాల్యుయేషన్ బాధ్యతగా, జాగ్రత్తగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ డీఈఓ, ఎంఈఓ, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply