Rangel | ఉపాధి హామీని పున:రుద్ధరించాలి

Rangel | ఉపాధి హామీని పున:రుద్ధరించాలి

Rangel | రెంజల్, ఆంధ్రప్రభ : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంను జి రాం జిగా పేరు మార్చడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు పార్వతి రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఇవాళ‌ మండలంలోని బోర్గం గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పుట్టి.నడిపి నాగన్నతో కలిసి పార్వతి రాజేశ్వర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం పనులను నాశనం చేయడమే ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశమన్నారు. ఇది తొందరపాటు చర్య అని, ప్రయత్నాన్ని తిప్పి కొట్టాలన్నారు.

ప్రజెంట్ ఆధారిత పథకంగా మార్చి వికాస్‌ భారత్ గ్రామీణ ఉపాధి హామీ విబిజిఆర్ఏఎంజిగా పేరు మార్చడం ద్వంద్వ‌ వైఖరని ఆరోపించారు. 2005 గ్రామీణ ఉపాధి హామీ పథకం పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదించారని, ఆ సమయంలో బీజేపీ కూడా కలిసి చట్టానికి సంఘీభావం తెలిపారన్నారు. ప్రస్తుతం ఈ చట్టాన్ని మార్చడం ద్వారా గ్రామీణ పేదలకు పనిచేసే హక్కు, ఆహార హక్కుల్ని బీజేపీ ప్రభుత్వం దూరం చేయడమేన‌న్నారు. ఈ కొత్త చట్టం గ్రామీణ ధనికులకు ప్రయోజనాల కోసమే రూపొందించడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం తన నియంత్రణను పెంచుతూ రాష్ట్రాలపై అదనపు భారం మోపుతుందన్నారు.

రాష్ట్రాల వాటను గతంలో 10శాతం నుండి 40 శాతానికి పెంచి, కేంద్రం వాటను 90 శాతం నుండి 60 శాతానికి తగ్గించిందన్నారు. దాడిని ఎదుర్కొని ఓడించడానికి దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, రైతాంగం గ్రామీణ పేదలకు, మహిళలకు పెద్ద ఎత్తున పోరాటానికి కలిసి రావాలని అన్నారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రెంజల్ మండల కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. నాయకులు ఓడ్డేన్న, సిద్ధ పోశెట్టి, అమీర్, మన్నె పోశెట్టి, సభారుద్దీన్, గోపాల్ తో పాటు తదితరులు ఉన్నారు.

Leave a Reply