మంగళ్పహాడ్ చౌరస్తా వద్ద హనుమాన్ దీక్షాపరుల రాస్తారోకో

మంగళ్పహాడ్ చౌరస్తా వద్ద హనుమాన్ దీక్షాపరుల రాస్తారోకో
ఎడపల్లి,ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం మంగళ్ పహాడ్ చౌరస్తా వద్ద బుధవారం హనుమాన్ మాలదారులు రాస్తారోకో చేపట్టారు. మంగళ్పహాడ్ ప్రభుత్వ పాఠశాలలో హనుమాన్ మాల ధారణ చేసిన విద్యార్థి పై పాఠశాల ఉపాధ్యాయిని చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ హనుమాన్ దీక్షాపరులు పాఠశాల గేట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం మంగళ్ పహాడ్ చౌరస్తా వద్ద రాస్తా రోకో చేపట్టారు. ఘటనా స్థలానికి ఎస్సై ముత్యాల రమ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

