Raghav Chadha | ఆప్ లో ముసలం

Raghav Chadha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆమ్ ఆద్మీ పార్టీలో తిరుగుబాటు మొదలైంది. ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డా బీజేపీలో చేరారు. ఇటీవలే ఆయన్ను పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి ఆప్ తొలగించిన విషయం తెలిసిందే. చడ్డాతో పాటు మరో ఇద్దరు ఆప్ ఎంపీలు సందీప్ పాఠక్, అశోక్ మిత్తల్ కూడా బీజేపీలో చేరారు. రాజ్యసభలో తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు వెల్లడించారు.
