రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
-ఆంజనేయులు గౌడ్
మెదక్, ఆంధ్రప్రభ నేడు నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రైతులు తమ పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
నిర్వాహకులతో మాట్లాడుతూ… రైతులకి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేయాలి అన్నారు. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ అందించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల నుండి కటింగుల పేరిట కొనుగోలు సెంటర్లలో ధాన్యంను నిలువు దోపిడి చేశారని అన్నారు.
రైతు సమస్యల విషయంలో తాను ఏనాడు రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తాం, కొనుగోలు పూర్తయిన వెంటనే ఒకటి రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పద్మావతి అశోక్ గౌడ్,గౌరీశంకర్,పంచాయతీ కార్యదర్శి రమేష్, మహేశ్వరి, నర్సింలు, ఉప్ప సర్పంచ్, వార్డు సభ్యులు, ఐకేపీ సభ్యులు, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
