Kavitha | నేరెళ్లలో కవిత భావోద్వేగం
నాడు అధికారంలో ఉన్న కుటుంబంలో సభ్యురాలినే..
బాధితులకు న్యాయం జరగాలని ఆకాంక్ష
Kavitha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నేరెళ్ల ఘటనపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి గురయ్యారు. నేరెళ్ల దళిత బాధిత కుటుంబాలను పరామర్శించిన సందర్భంగా మాట్లాడుతూ.. “నాడు అధికారంలో ఉన్న కుటుంబంలో నేను కూడా ఒక సభ్యురాలిని. నేరెళ్ల ఘటనను చూసి సిగ్గుతో తల వంచుకుంటున్నాను. ప్రజలందరూ నన్ను క్షమించండి” అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని ఆశించామని, కానీ కొందరి ధనదాహం కారణంగా నేరెళ్లలో పలువురు బాధితులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే బాధితుల్లో మరో వ్యక్తి మృతి చెందడం మరింత బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. బాధితులకు అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
