సీఎం రేవంత్‌కు ప్రియాంక గాంధీ అభినందనలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలపై బీజేపీ విధానంలో ఉన్న లోపాలను ప్రజల ముందుంచడంతో పాటు ప్రత్యామ్నాయ సూచనలు చేసి దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు కృషి చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అభినందించారు.

శనివారం ఉదయం ఢిల్లీలో ప్రియాంక గాంధీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా దక్షిణ భారతంతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలను బలహీనపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రజాస్వామ్య విరుద్ధ రాజ్యాంగ సవరణను అడ్డుకోవాల్సిన అవసరాన్ని చర్చించారు.

దేశ భవిష్యత్తును కాపాడేందుకు ప్రతిపక్ష శక్తులను ఏకతాటిపైకి తీసుకురావడంలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు మద్దతుగా నిలిచినందుకు తెలంగాణ ప్రజల తరఫున ప్రియాంక గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply