BRS | గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు అందుకున్న సంతోశ్ కుమార్
BRS | గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు అందుకున్న సంతోశ్ కుమార్
BRS | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : బీఆర్ఎస్ మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోశ్ కుమార్ గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డు అందుకున్నారు. లండన్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో జరిగిన వరల్డ్ క్లైమేట్ లీడర్స్ కాన్‌క్లేవ్‌లో ఏప్రిల్ 17, 2026న ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. పర్యావరణ పరిరక్షణలో, ముఖ్యంగా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ద్వారా దేశవ్యాప్తంగా చేపట్టిన హరిత కార్యక్రమాలకు గాను ఈ అంతర్జాతీయ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. లండన్ లోని బ్రిటిష్ పార్లమెంట్, హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ “హరా హై తో భరా హై” నినాదంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ భాగస్వామ్యం చేస్తూ, కోట్లాది మొక్కల నాటడం ద్వారా పర్యావరణ ఉద్యమంగా మారింది. అవార్డును అందుకున్న సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికీ ఈ అవార్డు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
