నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత..

అచ్చంపేట, ఆంధ్రప్రభ : 132/33 కేవీ అచ్చంపేట సబ్‌స్టేషన్‌లో నిర్వహించనున్న మరమ్మతుల పనుల కారణంగా శనివారం (జూన్ 6) పలు మండలాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 4 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు అచ్చంపేట, అమ్రాబాద్, పదర, బల్మూర్, లింగాల, ఉప్పునుంతల మండలాల పరిధిలోని అన్ని సబ్‌స్టేషన్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రైతులు, గృహ వినియోగదారులు, వాణిజ్య సంస్థల యజమానులు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకుని విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు. ఈ మేరకు అచ్చంపేట ఆపరేషన్ విభాగం అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఒక ప్రకటనలో తెలిపారు.