ఎంపీ నిధులతో దేవాలయాన్నిఅభివృద్ధిచేసుకుందాం..
ఎంపీ నిధులతో దేవాలయాన్నిఅభివృద్ధిచేసుకుందాం..
కమ్యూనిటీ హాల్ భవనం పనులు త్వరగాపూర్తిచేయాలి..
ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పి వైస్ చైర్మన్ గరిడినింగిరెడ్డి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ సహకారంతోపడమటిఆంజనేయ స్వామిదేవాలయఅభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని పాలమూరుఉమ్మడిజిల్లామాజీ జడ్పీ వైస్ చైర్మన్ గరిడి నింగిరెడ్డి, ఊట్కూర్ సర్పంచ్ ఎం. రేణుక భరత్, మాజీ జెడ్పిటిసిలుసూర్య ప్రకాశ్ రెడ్డి, అరవింద్ కుమార్, మాజీ ఎంపీటీసీ రాధాకృష్ణయ్య గౌడ్ అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ఎల్బీనగర్ శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో ఎంపీడీకే అరుణ నిధులు రూ. 10 లక్షలతో కమ్యూనిటీభవన నిర్మాణానికి భూమిపూజచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఊట్కూర్ మండల కేంద్రంలో సువిశాలమైన ప్రదేశంలో కమ్యూనిటీ భవనం నిర్మాణానికి ఎంపీ డీకే అరుణ నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు.
దేవాలయం ప్రాంగణంలో కమ్యూనిటీ భవనం నిర్మించడం వల్ల శుభకార్యాలు చేసేందుకు అనుకూలంగా ఉంటుందనిఅన్నారు. భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తే భక్తులకు అందుబాటులోకి వస్తుందని అన్నారు. శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని పునర్నిర్మాణంచేసి, కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. దేవాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించి గ్రామంలో ఆధ్యాత్మికత పెంపొందించేందుకు కృషి చేద్దామన్నారు. కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఎంపీడీకే అరుణ నిధులు మంజూరు చేయడంతో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్ వార్డు సభ్యురాలు మంగమ్మ, మాజీ వార్డు సభ్యుడు నరసింహరాజుగౌడ్ నాయకులుఎల్కోటి జనార్దన్ రెడ్డి, శెట్టిరమేష్, గరిడి లక్ష్మారెడ్డి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
