ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టండి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరికి అవకాశం కల్పించాలని ఊట్కూర్ తహసిల్దార్ అశోక్ కుమార్ ఆదేశించారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల, చిన్నపోర్ల, ఎడవెల్లి, మల్లేపల్లి, నాగిరెడ్డిపల్లి, ఊట్కూర్, గ్రామాల్లో బీఎల్వోలు, బి ఎల్ ఎ లు ఇంటింటికి వెళ్లి ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్వోలు ఓటర్లకు ఫారాల పంపిణీ, వివరాల నమోదు, అవగాహన కల్పన తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు.ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలను అందజేయాలని, ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం పనిచేయాలన్నారు.ఓటర్ల నుంచి అందిన ఫారాలను నిర్ణీత గడువులోగా స్వీకరించి, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఎస్ఆర్ఐ ప్రక్రియకు సహకరించాలనికోరారు.ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే కీలక ప్రక్రియనిఅధికారులు, బీఎల్వోలు పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచులు ఆర్ ఐ లు కృష్ణారెడ్డి వెంకటేష్, బి ఎల్ ఓ లు బి ఎల్ ఏ లు తదితరులు పాల్గొన్నారు.
