గురజాల క్లస్టర్ ఏఈఓగా గౌసియా బేగం బాధ్యతల స్వీకరణ

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మండల వ్యవసాయ శాఖ పరిధిలోని గురజాల క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిగా గౌసియా బేగం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఏఈఓ కే. శ్రీను బదిలీపై భీమిని మండలం కేస్లాపూర్ క్లస్టర్‌కు వెళ్లగా.. గౌసియా బేగం చెడ్వాయి క్లస్టర్ నుండి బదిలీపై గురజాలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె బాధ్యతలు స్వీకరించి మాట్లాడుతూ.. గురజాల క్లస్టర్ పరిధిలోని రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, వ్యవసాయ శాఖ ద్వారా లభించే రాయితీలు, ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా చూస్తానన్నారు. సాగు విషయాల్లో రైతులకు తగిన సలహాలు, సూచనలు అందిస్తూ నాణ్యమైన సేవలందించడానికి తన వంతు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.