విద్యార్థి వినూత్న ప్రయోగం..అబ్బుర పరిచే ప్రతిభ
విద్యార్థి వినూత్న ప్రయోగం..అబ్బుర పరిచే ప్రతిభ
- అట్టలు, సిరంజీ లు,గ్లూకోజ్ పైపులతో జేసీబీ తయారీ
మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రానికి చెందిన బోయిని నర్సింహా,యాకమ్మ ల కుమారుడు బోయిని రిత్విక్(మింటు) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్నాడు.ఈ వేసవి సెలవుల్లో తాను ఎదో ఒకటి చేయాలనే తపనతో కేవలం అట్టలు, సిరంజి లు, గ్లూకోజ్ పైపులు, ట్యాగ్ ల సహాయం తో జేసీబీ యంత్రాన్ని తయారు చేసి ప్రయోగం చేశాడు.గతంలో వైబ్రేషన్ మిషన్ , వాటర్ మోటర్ ని తయారు చేశాడు.
ఈ జేసీబీ మిషన్ ని సిరంజి లలో నింపిన వాటర్, గ్లూకోజ్ పైపుల ద్వారా హైడ్రాలిక్ మోడల్ లో జేసీబీ మిషన్ ని అటు ఇటు తిప్పుతూ పైకి లేపుతూ ఆపరేట్ చేస్తున్నాడు. చిన్నప్పటి నుండి తనకు ఎలక్ట్రానిక్స్ పరికరాలు చేయడంలో చాలా ఆసక్తి.మున్ముందు తాను ఎలక్ట్రానిక్స్ రంగంలో నూతన ప్రయోగాలు చేసి ఆ దిశగా కృషి చేయాలని ఉంది.10 వ తరగతి పూర్తి అయితే పాలిటెక్నిక్ చేసి ఇంజనీరింగ్ రూట్లో వెళ్లాలని ఉంది.
