Politics | ఝార్ఖండ్ రాజకీయాలపై నివేదిక

Politics | ఝార్ఖండ్ రాజకీయాలపై నివేదిక

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. పార్టీ వ్యవహారాలు, రానున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం.

పార్టీ ఆదేశాల మేరకు ఇటీవల ఝార్ఖండ్‌కు వెళ్లిన భట్టి విక్రమార్క, అక్కడి రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలను ఖర్గేకు వివరించినట్లు తెలుస్తోంది. స్థానిక రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యూహాలపై తన పరిశీలనలను ఆయన అధిష్ఠానానికి నివేదించారు.

త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ బలోపేతం, వివిధ రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై అధిష్ఠానం నేతలతో భట్టి అభిప్రాయాలు పంచుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.