25aprileditorial | ఆప్‌లో తిరుగుబాటు వెనుక కమలం?

25aprileditorial | ఆప్‌లో తిరుగుబాటు వెనుక కమలం?
25aprileditorial | ఆప్‌లో తిరుగుబాటు కారణాల విశ్లేషణ
కేజ్రీవాల్ ఎదుగుదల నుండి సంక్షోభం వరకు
అవినీతి ఆరోపణలు, రాజకీయ ఒత్తిళ్లు
బీజేపీ-ఆప్ రాజకీయ పోరు
రాఘవ్ చెడ్డా పాత్ర, తిరుగుబాటు ప్రభావం
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో తిరుగుబాటులో కొంత ఆ పార్టీ వ్యవస్థాపకుడు కేజ్రీవాల్ స్వయం కృతం, మరి కొంత కేంద్ర హోం మంత్రి అమిత్ షా నడిపిన తంత్రాంగం కారణం. బీజేపీకి వ్యతిరేకంగా ఆయన జాతీయ స్థాయిలో ఇండియా కూటమి పార్టీలతో జత కట్టడం వల్ల ఆయనపై ఆ పార్టీ కత్తి కట్టింది. ఆయన కూడా కొంత అతిగా వ్యవహరించారు. ఆయన స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు. ఆదాయంపన్ను శాఖలో ఉన్నతోద్యోగం చేసి అన్నా హజారే నేతృత్వంలో సమాజ సేవకు అంకితమయ్యారు. అలా ఉండి ఉంటే హజారే వారసునిగా స్థిరపడి ఉండేవారేమో. ఆయన రాజకీయాల్లోకి రావడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని నెలకొల్పారు.
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఏ అవినీతికి వ్యతిరేకంగా పోరాటాలు జరిపారో, ఆ అవినీతితో రాజీ పడాల్సి వచ్చింది. దాంతో ఆయనకు మొదట్లో సన్నిహితంగా మెలిగిన వారంతా దూరమయ్యారు. ఢిల్లిd మునిసిపల్ ఎన్నికల్లో సాధించిన విజయాలతో ఆయన స్వర్గానికి నిచ్చెన వేసినట్టు అసెంబ్లిdకి పోటీ చేసి విజయాలను చవి చూశారు. ఆయన నెలకొల్పిన ఆప్ ఢిల్లిdలో అధికారాన్ని చేపట్టింది. కాంగ్రెస్ అవినీతిపై పోరాటం ప్రారంభించిన ఆయన బీజేపీపై కూడా పోరాటం జరపడంతో ఆ పార్టీ నాయకులకు వ్యతిరేకమయ్యారు.

అక్కడితో ఆగకుండా ఆయన నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీపైనే పోటీ చేసేందుకు వారణాసికి వెళ్ళారు. ఆయన నెలకొల్పిన ఆప్ పార్టీని ఢిల్లిdతో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, తదితర రాష్ట్రాలకు విస్తరింపజేసేందుకు ప్రయత్నించారు. ఢిల్లిd ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు జరపకపోగా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కోసం అవినీతి పరులతో రాజీ పడ్డారు. ఆయన మంత్రివర్గ సహచరులపైనా, ఇతర రాష్ట్రాల్లో ఆప్ నాయకులపైనా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రధానమంత్రి మోడీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడంతో ఆయనను సహజంగానే బీజేపీ రాజకీయ ప్రత్యర్ధిగా పరిగణించింది.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆయనపైనా, ఆయన అనుచరులపైనా అవినీతి కేసులు నమోదు చేయించి ఆయనను, ఆయన మంత్రివర్గ సహచరులను జైలుకి పంపింది. జైలు నుంచే పాలన సాగిస్తానని ప్రకటించి ఆయన కేంద్రంపై ధ్వజమెత్తారు. చివరికి న్యాయపోరాటంలో గెలిచి బెయిల్‌పై విడుదల అయ్యారు. ఢిల్లిdతో పాటు పంజాబ్‌లో అధికారం కైవసం చేసుకోవడం ద్వారా రాజ్యసభలో బలాన్ని పెంచుకున్నారు.
రాఘవ్ చెడ్డా వంటి పలువురు యువనాయకులను రాజ్య సభకు పంపారు. రాఘవ్ చెడ్డా రాజ్యసభలో ఆప్ తరఫున పోరాటం జరిపి మంచి పేరు సంపాదించారు. ఒత్తిడులకు లోనై రాఘవ్ చెడ్డా వంటి వారికి దూరమయ్యారు. ఇప్పుడు వారంతా కేజ్రీవాల్‌పై తిరుగుబాటు చేశారు. కేజ్రీవాల్‌ని జైలుకి పంపడంలో, ఆప్‌లో తిరుగుబాటును ప్రోత్సహించడంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రమేయం ఉందన్న ఆరోపణలు వచ్చాయి.
వచ్చాయి. రాఘవ్ చెడ్డా బీజేపీలో చేరడంతో వాటికి బలం వచ్చింది. కేజ్రీవాల్‌ని మళ్ళీ జైలుకి పంపేందుకు అమిత్ షా పావులు కదుపుతున్నట్టు వార్తలు వచ్చాయి. మొత్తం మీద బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం సాగించడం వల్లనే కేజ్రీవాల్ కష్టాలు పాలయ్యారన్న వార్తల్లో అవాస్తవాలు లేవు.
