సర్పంచులతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం…

సర్పంచులతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం…

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తొర్రూరు, ఆంధ్రప్రభ : సర్పంచులతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అభిప్రాయపడ్డారు.మండలంలోని పెద్ద మంగ్య తండా సర్పంచ్ జాటోతు రామ్ లాల్ గురువారం పాలకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే యశస్విరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. సర్పంచ్ రామ్ లాల్ ను ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించి అభినందించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, సర్పంచులు గ్రామాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు దాతల సహకారంతో గ్రామాలు , తండాల్లో మెరుగైన సౌకర్యాలు సమకూర్చాలన్నారు.

ప్రజా ప్రభుత్వం గ్రామాలకు రహదారులు, మంచినీరు, నిరంతర విద్యుత్, పెట్టుబడి సాయం, రైతు బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తుందని గుర్తు చేశారు. గ్రామ ప్రథమ పౌరులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించాలన్నారు. కాంగ్రెస్ అభివృద్ధిని చూసి ఆయా గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోతు హామ్యా నాయక్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్ తదితరులు పాల్గొన్నారు.