పర్వతగిరి, మే28 (ఆంధ్రప్రభ) : వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో దొంగనోట్ల చెలామణి వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. మండల కేంద్రానికి చెందిన దుర్గా శ్రీ వైన్ షాప్ లో గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం మద్యం కొనుగోలు చేసారు. వారు ఇచ్చిన డబ్బుల్లో దొంగనోటు వచ్చినట్లు మీడియాకు తెలిపి మండల ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలంని షాప్ నిర్వాహకులు సూచించారు. తన వ్యాపారంలో వచ్చిన డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్లగా బ్యాంకు అధికారులు దొంగ నోట్లను గుర్తించినట్లు తెలిపాడు. దొంగనోట్లు మండలంలో చెలామణి చేస్తున్నారనే వ్యవహారం మండలంలో కలకలం సృష్టించింది.
WGL | పర్వతగిరిలో దొంగనోట్ల కలకలం…
