ధర్నా చేస్తున్న విద్యుత్ కార్మికులు

ధర్నా చేస్తున్న విద్యుత్ కార్మికులు
విద్యుత్ కార్మికులను కన్వర్షన్ చేయాలి
తొర్రూరు,ఆంధ్రప్రభ : విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని టీఎస్ ఎన్పీడీసీఎల్ కంపెనీ చైర్మన్ ధరావత్ సికిందర్ డిమాండ్ చేశారు.విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం డివిజన్ కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆర్టిజన్, ఆన్ మ్యాన్, స్పాట్ బిల్లర్స్,పీస్ రేట్ కార్మికులు మహా ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సికిందర్ మాట్లాడుతూ ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలలో దాదాపు 20 వేల మంది ఆర్టిజన్స్ ఏడేళ్లుగా పని చేస్తున్నారని, అంతకుముందు ఈ కార్మికులందరూ 20 ఏళ్లు కాంట్రాక్టు పద్ధతిలోనే విద్యుత్ సంస్థల్లో పని చేశారని గుర్తు చేశారు. అన్ మ్యాన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాబట్టి కార్మికుల విద్యార్హతల ఆధారంగా జేఎల్ఎం,జూనియర్ అసిస్టెంట్, సబ్ ఇంజినీర్,ఆఫీస్ సబార్డినేట్ గా కన్వర్షన్ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తొర్రూరు డివిజన్ చైర్మన్ పసుపులేటి మధు, కన్వీనర్ బంధారపు శ్రీనివాస్,కో చైర్మన్ పి నాగరాజు,కో కన్వీనర్ రమేష్,జి.హరిప్రసాద్,ప్రకాష్, మంద వీరన్న,శ్రీను,వెంకన్న,ఎల్ల గౌడ్,జ్యోతి,సంధ్య,రవీందర్, రవికాంత్,పుల్లయ్య,హరీష్ తదితరులు పాల్గొన్నారు.
