Operation Sindoor-2 | భారత్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పాక్‌కు వార్నింగ్
Operation Sindoor-2 | భారత్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పాక్‌కు వార్నింగ్
Operation Sindoor-2 | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తే తీవ్ర పరిణామాలుంటాయని పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్ ఇచ్చారు. భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన ‘సేనా సంవాద్’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదులను భారత్‌పై ప్రయోగించాలని చూస్తే పాకిస్థాన్‌ను ప్రపంచపటంలో లేకుండా చేస్తామని హెచ్చరించారు. చరిత్రలో ఉండాలని ఉందో, లేదో తేల్చుకోవాలని హెచ్చరించారు. ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను భారత్ ఒకేవిధంగా పరిగణిస్తామన్నారు. పాక్ తన తీరును మార్చుకోకుంటే ఆపరేషన్ సిందూర్-2 మొదలవుతుందన్నారు. భారత్‌కు ఇబ్బందులు కలిగించాలని చూస్తే దీటుగా స్పందిస్తామన్నారు.
ఆపరేషన్ సిందూర్ వార్షికోత్సవం పూర్తి చేసుకున్న వేళ వ్యాఖ్యలు..
పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఇటీవలే ఏడాది పూర్తైంది. ఆపరేషన్ సిందూర్ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకున్న కొద్ది రోజుల తర్వాత సేనా సంవాద్ కార్యక్రమంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం పెంచి పోషిస్తే ఊరుకోబోమని పాకిస్థాన్‌కు గట్టి సందేశాన్ని ఇచ్చారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా దేశ వైఖరిని పునరుద్ఘాటించారు.
