ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను 100 శాతం పూర్తి చేసిన బీఎల్‌వోకు సన్మానం

విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన అధికారిని అభినందించిన సర్పంచ్

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఓబులాపూర్ గ్రామంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను 100 శాతం పూర్తి చేసిన బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌వో)ను గ్రామ సర్పంచ్ సత్యనారాయణరెడ్డి ఆదివారం ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో బీఎల్‌వోల కృషి ప్రశంసనీయమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితమైన ఓటరు జాబితా ఎంతో అవసరమని పేర్కొన్నారు.

విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించి ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను పూర్తి చేసిన బీఎల్‌వోను ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హన్మంతు, పంచాయతీ కార్యదర్శి లక్ష్మిదేవి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.