నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో ఎన్ టి ఏ రద్దు చేయాలి..
పరకాల, ఆంధ్రప్రభ : నీట్ పేపర్ లీకేజీ, అవినీతి మరియు పరీక్షల నిర్వహణలో జరిగిన ఘోర వైఫల్యాలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తులో పారదర్శకత, బాధ్యత లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో పేపర్ లీకేజీలు జరగడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, విద్యార్థులకు న్యాయం చేయాలని, విశ్వసనీయమైన ప్రజాస్వామ్య పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కళ్యాణ్ డిమాండ్ చేశారు.
