Nandavaram | జీ రామ్ జీ రద్దు చేయాలి – సీపీఐ..
Nandavaram | జీ రామ్ జీ రద్దు చేయాలి – సీపీఐ..
Nandavaram, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని బుధవారం సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పంపన్నగౌడ్ ఆధ్వర్యంలో నందవరం బస్టాండ్ సర్కిల్ నందు నిరసన చేపట్టారు. ఈసందర్బంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కూలీలకు ఇబ్బందిగా ఉండేలా జీ రామ్ జీ చట్టం ఉందని వాటి పత్రాలు భోగి మంటలో వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గిడ్డయ్య, శాంతన్న, ముని, రామలింగప్ప, బసవరాజు, తిమ్మప్ప, వెంకటేశ్లు, పాండు, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.
