అచ్చంపేటలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’

అచ్చంపేటలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’

అచ్చంపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం అచ్చంపేట మున్సిపాలిటీలో సోమవారం ప్రారంభమైంది. డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు రాబోయే 99 రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు స్వయంగా చీపురు పట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 14వ వార్డు కూరగాయల మార్కెట్ రోడ్డులో మున్సిపల్ కమిషనర్ మురళితో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.

పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడమే ఈ 99 రోజుల ప్రణాళిక ప్రధాన లక్ష్యమని చైర్మన్ తెలిపారు. ప్రభుత్వం మూడోసారి ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటోందని, పల్లెలు మరియు వార్డుల రూపురేఖలను మార్చడమే ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఉద్దేశమని నాయకులు పేర్కొన్నారు. గ్రామ సభలు నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకుని, సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆకుల వెంకటేష్, సోమ్లా నాయక్, తగరం శ్రీను, రమేష్ యాదవ్, బాబా, పార్టీ నాయకులు చంద్రమోహన్, లక్ష్మన్ బాబు, లాలు యాదవ్, వంశీ, మున్సిపల్ సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply