తెలుగు జాతి గర్వకారణం ఎన్టీఆర్

తెలుగు జాతి గర్వకారణం ఎన్టీఆర్
పుల్లంపేట, ఆంధ్రప్రభ : పుల్లంపేట మండలంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని రెడ్డిపల్లి కట్ట ఆవరణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా చెరగని ముద్ర వేసిన నాయకుడిగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన సామాన్య ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు.
