ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని రాఘవాపూర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలను స్వీకరించి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు జి. అవంతిక హెడ్మాస్టర్‌గా, కె. భవ్యశ్రీ డీఈఓగా బాధ్య తలు నిర్వహించారు. అలాగే నిహారిక, అనుశ్రీ, సిరి, నందీశ్వర్, శివాజీ ఉపాధ్యాయులుగా పాల్గొని పాఠాలు బోధించారు.
అనంతరం సమావే శానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. అనిల్ అధ్యక్షత వహించ గా గ్రామ సర్పంచ్ మెరుగు క్రాంతి కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యా యులుగా వ్యవహరించడం ద్వారా తమకు గొప్ప అనుభవం కలిగిం దన్నారు.
జీవితంలో మరచిపోలేని అనుభూతి పొందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కే. శ్రీమాధవి, విమలాదేవి, మల్లేశం, ముస్తాక్, ఉపసర్పంచ్ గుర్రపు నరసింహులు, వార్డు సభ్యులు అంబికా, లత, అమ్మ, ఆదర్శ పాఠశాల చైర్‌పర్సన్ రాధా తదితరులు పాల్గొ న్నారు.
