Rural development | గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలి…
Rural development | గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలి…
Rural development | ఊట్కూర్, ఆంధ్రప్రభ : గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అవుసలోనిపల్లి సర్పంచ్ ఎల్లమ్మ తిమ్మప్ప, ఉపసర్పంచ్ చెనప్ప అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోనిఆవుసలోనిపల్లి గ్రామంలో వివిధ వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి(Village development)కి కృషి చేస్తాననిఅన్నారు. గ్రామంలో సీసీ రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుతో పాటు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. గత కొన్నేళ్లుగా విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో నూతనంగా విద్యుత్(electricity) స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ సమస్య పరిష్కరించాలని అన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేద ప్రజలకు అందే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోవార్డు సభ్యులు నీత, చంద్రాములు, నాగేష్, ధశరథ్, తిమ్మమ్మ, ప్రకాష్, కాశిమప్ప, భగవంతమ్మ, సంజమ్మ, విద్యుత్ లైన్‌మెన్ నర్సింహులు, ప్రజలు వెంకట్ రెడ్డి యువకులు వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు, పోలురాజ్, కుర్వ రాము తదితరులు పాల్గొన్నారు.
