విద్యార్థులకు ఘన సన్మానం

విద్యార్థులకు ఘన సన్మానం

రాప్తాడు, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పరిక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించిన విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమమైన ఉత్తమమైన మార్కులు సాధించి ఉత్తీర్ణులయిన శుభ సంధర్భంగా రాప్తాడు మండలంలోని ఎంపీడీవో కార్యాలయం నందు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు సన్మానం చేశారు.టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాలతో ఘనంగా సన్మానించారు.అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.

మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు.ఈ సంధర్భంగా ఇన్చార్జి మురళి మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రోత్సాహకంగా నగదు బహుమతులను అందజేశామని తెలిపారు.పేద కుటుంబాలలోని పిల్లల చదువుల కోసం తమ వంతు సహాయ సహకారాన్ని అందిస్తామని తెలియజేశారు.చదువు జీవితానికి వెలుగునిస్తుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదువుకోవాలన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని సమస్యలు వచ్చినా చదువుకోవడం మాత్రం వదిలిపెట్టకూడదన్నారు.

ప్రైవేట్ పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అనే నినాదంతో ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.పరీక్షలకు ముందు మండల వ్యాప్తంగా విద్యార్థులకు మోడల్ పేపర్స్ పుస్తకాలను అందించినందుకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ విజయ కుమారి ఎంఈఓ మల్లికార్జున ఎంపీడీవో జయలక్ష్మి డిప్యూటీ ఎంపీడీవోలు అశోక్ బాబు అచ్యుతనంద బాబు మండల కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు కన్వీనర్ కొండప్ప ఎంపీటీసీ జాఫర్ ఖాన్ ఇంచార్జి సోమర నారాయణస్వామి ఫీల్ అసిస్టెంట్ శివయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply